నేడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న పవన్

నేడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో పవన్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో పవన్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. పవన్ పర్యటన సందర్భంగా నాదెండ్ల మనోహర్ పెదరావూరులో భారీ ఏర్పాట్లు చేశారు.