తిరుమలలో పవన్ కళ్యాణ్ 

తిరుమలలో పవన్ కళ్యాణ్ 

జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు  తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆయన ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. కాలినడకన ఆయన రేపు తిరుమల చేరుకుంటారు. తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకుంటారు. తరవాత ఆయన అక్కడే తన బస్సు యాత్ర వివరాలను మీడియాకు వెల్లడించే అవకాశముంది.  జిల్లాల పర్యటనకు ఆయన ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు.   చిత్తూరు జిల్లాలో ఆయన  రెండు రోజు పర్యటింవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.  పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలతో ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు.   పవన్‌ కళ్యాణ్‌ పర్యటనను జనసేన పార్టీ వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి.