ఎన్నికలకు ముందు పవన్ సినిమా చేయాలనుకుంటున్నారా ?

ఎన్నికలకు ముందు పవన్ సినిమా చేయాలనుకుంటున్నారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేసి ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు.  ఇకపై ఆయన సినిమాలు చేసే అవకాశం ఉండదని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ వచ్చారు.  కానీ ఎన్నికలకు వెళ్లే ముందు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. 

దీనివలన రాబోయే ఎన్నికల కోసం పార్టీలో, కార్యకర్తల్లో, అభిమానుల్లో నూతన ఉత్తేజం నిండే అవకాశముంటుందనేది ఆయన అభిప్రాయమాట.  ఈ విషయమై ఆయన శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులతో చర్చంచి తన తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి.  ఏది ఏమైనా చాలా కాలం నుండి పవన్ ను వెండి తెర మీద చూసుకోలేకపోతున్న అభిమానులకు ఇదొక మంచి వార్తేనని చెప్పొచ్చు.