ఆయన ఓటు ఆమెకే...

ఆయన ఓటు ఆమెకే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేపే ఓటింగ్ జరగనుంది.. అయితే తన ఓటు తానే వేసుకోలేకపోతున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్, హుజూర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి... అదేంటి. ఆయన ఓటు ఆయన వేసుకోకపోవడమేంటి? అనే డౌట్ వెంటనే రావొచ్చు... అసలు విషయమేంటంటే ఉత్తమ్‌కు హుజూర్‌నగర్‌లో ఓటు లేకపోవడమే. ఈ పరిస్థితి ముచ్చటగా మూడోసారి ఉత్తమ్‌కు ఎదురైంది. ఆయన హుజూర్ నగర్ నుంచి ఎన్నికల బరిలో ఉండగా... ఉత్తమ్ ఓటు కోదాడలో ఉండటంతో కోదాడలో రేపు కోదాడలో ఆయన ఓటుహక్కు వినియోగంచుకోనున్నారు. ఇక కోదాడ అభ్యర్థి, తన భార్య పద్మావతితో కలిసి ఓటు వేయనున్నారు కాంగ్రెస్ బాస్. కోదాడలోని నయానగర్ ఈవీ రెడ్డి కళాశాలలో ఓటు వేయనున్నారు ఉత్తమ్ దంపతులు... అంటే ఉత్తమ్ ఆయన ఓటు ఆయన వేసుకోలేకపోయినా... తన భార్యకు ఓటు వేయనున్నారు.