పెళ్లిచూపులు కాంబో రిపీట్!

పెళ్లిచూపులు కాంబో రిపీట్!
పెళ్లిచూపులు' చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత 'అర్జున్ రెడ్డి'తో తన పరిధిని మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'టాక్సీవాలా' సినిమాలో నటిస్తున్నాడు. అలానే తన లిస్టులో నటించాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా తనకు 'పెళ్లిచూపులు' చిత్రంతో బ్రేక్ ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
'మెంటల్ మదిలో' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన వివేక్ ఆత్రేయ.. ఇటీవల విజయ్ దేవరకొండను కలిసి కథ వినిపించినట్లు సమాచారం. కథ నచ్చడంతో విజయ్ కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించిన 'మహానటి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.