పేట ఓపెనింగ్ సీన్ కు అభిమానులు ఫిదా..!!

పేట ఓపెనింగ్ సీన్ కు  అభిమానులు ఫిదా..!!

రజినీకాంత్ పేట సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 2పాయింట్ 0 తరువాత వస్తున్న సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడినా ఎక్కడో ఓ మూలన ఈ సినిమా కూడా కబాలి, కాలా లా ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి.  సినిమా చూసిన తరువాత అభిమానులు పేట పరాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.  

పేట ఓపెనింగ్ సీన్లో రజినీకాంత్ ఇంట్రడక్షన్ గూస్ బమ్స్ తెప్పిస్తాయి.  69 సంవత్సరాల వయసులో కూడా రజినీకాంత్ అంత యాక్టివ్ గా నటించాడు.  పేస్ లో సీరియస్, మ్యానరిజం, ఆటిట్యూడ్ తో కట్టిపడేశాడు.  ఇంట్రడక్షన్ సీన్ ఐదు నిముషాలు ఉంటె.. ఫైట్ మరో మూడు సినిమాలు వెరసి 8 నిమిషాల పాటు థియేటర్లో ఈలలు గోలలే.  మూడు గంటల నిడివితో వచ్చిన ఈ సినిమా ఆద్యంతం అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు.