పెట్రోల్ ధర మరో రూ.4 తగ్గింపా!

పెట్రోల్ ధర మరో రూ.4 తగ్గింపా!

పెట్రోల్ రేట్లపై దేశవ్యాప్తంగా వినూత్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన వినూత్న నిరసన తెలిపింది. మార్కెట్ రేటు కంటే రూ. 4లు తక్కువగా పెట్రోల్ విక్రయిస్తోంది. ఆ మేరకు ముంబయిలో ఏర్పాట్లు చేశారు. ముంబై తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 పెట్రోల్ బంకుల్లో ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టారు. కేవలం ద్విచక్ర వాహనదారులకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు.  ఒక్కరోజు ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ స్కీమును నెల రోజుల క్రితమే ప్రకటించింది ఎంఎన్ఎస్. దాన్ని అమలు చేస్తోంది. పార్టీ అధినేత రాజ్ థాక్రే 50వ పుట్టినరోజు. ఈ సబ్సిడీని మళ్లీ పెట్రోల్ బంకుల యజమానులకు అందించనున్నట్టు తెలిపారు ఎంఎన్ఎస్ నాయకులు.