పీహెచ్‌డీ ఉంటేనే ప్రొఫెసర్ పోస్ట్...

పీహెచ్‌డీ ఉంటేనే ప్రొఫెసర్ పోస్ట్...

యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి పీహెచ్‌డీ పట్టా ఉంటేనే అర్హులు... ప్రొఫెసర్ పోస్టుల నియామకంపై క్లారిటీ ఇస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటి వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరడానికి పీజీతో పాటు పీహెచ్‌డీ లేదా నెట్‌లో అర్హత సాధిస్తే సరిపోయేది. కానీ, ఇకపై ఈ పోస్టులకు పీహెచ్‌డీ తప్పనిసరి కానుంది. ఈ నిబంధన 2021-22 ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి అమలులోకి రానుంది. యూజీసీ తయారు చేసిన కొత్త నిబంధనలను వెల్లడించిన ప్రకాష్ జవదేకర్... దేశీయ వర్సిటీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 500 టాప్ వర్సిటీల్లో పీహెచ్‌డీ చేసినవారు కూడా దేశంలోని వర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసే అవకాశం కలిపిస్తున్నారు.