దుర్గగుడిపై ప్లాస్టిక్ నిషేధం

దుర్గగుడిపై ప్లాస్టిక్ నిషేధం

కొత్త ఏడాదిలో విజయవాడ దుర్గగుడిపై ఈవో కోటేశ్వరమ్మ కొత్త నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇప్పటికే జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఆడవారు, మగవారు సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అమ్మవారి దర్శనంకు అనుమతిస్తున్నారు. ఇక సంక్రాంతి నుంచి దుర్గగుడిపై ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తూ ఈవో కోటేశ్వరమ్మ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి దుర్గగుడి ఆలయంలో రాహుకేతు పూజలు ఉంటాయని తెలిపింది.