నా భార్య జాగ్రత్త... 

నా భార్య జాగ్రత్త... 

 విష రాజకీయ వాతావరణంలో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి  అని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ నుంచి ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ యూపీ  తూర్పు  ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లక్నోలో రోడ్‌ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా అభినందనలు తెలుపారు. సోషల్‌మీడియా వేదికగా ఉద్విగ్నభరిత పోస్టు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో అంతా మంచే జరగాలని ప్రియాంకను ఉద్దేశించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.నేడు దేశంలో ప్రతీకార, విషపూరిత రాజకీయ వాతావరణం ఉంది. కానీ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత అని నాకు తెలుసు. అందుకే ఆమెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ అని రాబర్ట్‌ వాద్రా పోస్టు చేశారు.