మోడీ అనిల్ అంబానీ చౌకీదార్: రాహుల్

మోడీ అనిల్ అంబానీ చౌకీదార్: రాహుల్

ప్రధాని మోడీ దేశ ప్రజల చౌకీదార్ కాదని ఆయన అనిల్ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు చౌకీదార్ అని ద్వజమెత్తారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాఫెల్ యుద్ధ విమానాల
కొనుగోలు విషయంపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మోడీ అవినీతిపరుడని ఆరోపించారు. అనిల్ అంబానీకి 30వేల కోట్ల ప్రాజెక్టు సమర్పించారని విమర్శించారు. మోడీ ఎంత
అవినీతిపరుడో ఈ కేసు బట్టబయలు చేస్తోందని రాహుల్ విమర్శించారు. అనిల్ అంబానీ కంపెనీకే రాఫెల్ ఒప్పందాన్ని ఇవ్వాలని ప్రధాని మోడీ తమతో చెప్పినట్లు డసాల్ట్ కంపెనీ అధికారి ఫ్రాన్స్
వెబ్‌సైట్‌కు తెలిపాడు. డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ అధికారి  వెల్లడించిన విషయం ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. దేశ రక్షణ మంత్రి ఎందుకు అకస్మాత్తుగా రాఫెల్ ప్లాంట్‌కు వెళ్లారని రాహుల్ ప్రశ్నించారు. మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌కు వెళ్లారు. డసాల్ట్ కంపెనీకి ఆమె వెళ్లనున్నారు.