బృందావన్ లో స్కూలు పిల్లలకు ఆహారం వడ్డించిన మోడీ

బృందావన్ లో స్కూలు పిల్లలకు ఆహారం వడ్డించిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ బృందావన్ ని సందర్శించారు. అక్కడ ఆయన నిరుపేద బాలలకు ఆహారం వడ్డించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ 300 కోట్ల ఆహారం మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఆయన బృందావన్ చంద్రోదయ మందిర్ ఆవరణలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

'ప్రధానమంత్రి నిరుపేద నేపథ్యం ఉన్న 20 మంది స్కూల్ పిల్లలకు ఆహారం వడ్డిస్తారని ..ఇది అక్షయ పాత్ర అందజేస్తున్న 300 కోట్ల ఆహారం కానుందని' ఇస్కాన్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ హెడ్ నవీన నీరద దాస తెలిపారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్ నెస్ (ఇస్కాన్) ద్వారా నిధులు సమీకరించే అక్షయ పాత్ర బెంగుళూరు కేంద్రంగా పని చేస్తోంది. ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా పని చేస్తోంది. బృందావన్ ఈ సంస్థకు అత్యాధునిక సదుపాయాలున్న వంటశాల ఉంది.