'సేవా దివస్' గా ప్రధాని మోడీ పుట్టినరోజు

'సేవా దివస్' గా ప్రధాని మోడీ పుట్టినరోజు

ప్రధాని మోడీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17ను 'సేవా దివస్' గా బీజేపీ పార్టీ ప్రకటించింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు పలు సేవా, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ సారి ప్రధాని మోడీ తన పుట్టినరోజు నాడు వారణాశిలో పర్యటించనున్నారు. 

సెప్టెంబర్ 17న అక్కడ పాఠశాల విద్యార్థులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని బీజేపీ పార్టీ ప్రకటించింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మహిళల కోసం రూ. 20కోట్లతో నిర్మిస్తున్న రెండు ఆసుపత్రులకు శంకుస్థాపన, రూ. 600కోట్లతో నిర్మించే క్యాన్సర్‌ ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం  బనారస్‌ హిందూ యునివర్శిటీలో ఆయన ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.