నేడు ఛత్తీస్‌గఢ్‌కు ప్రధాని మోడీ

నేడు ఛత్తీస్‌గఢ్‌కు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు... ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన ప్రధాని... గత 2 నెలల వ్యవధిలో అక్కడ పర్యటించడం ఇది రెండోసారి. తన పర్యటనలో భిలాయ్‌ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక ఐఐటీ-భిలాయ్‌కి శాశ్వత ప్రాంగణం, భవనాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నారు భారత ప్రధాని. అనంరతం భిలాయ్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. నయా రాయపూర్‌ ఇంటెగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్న ప్రధాని మోడీ... రాత్రి తిరిగి హస్తినకు చేరుకుంటారు.