ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. రక్షణ శాఖ భూముల వ్యవహారంపై ప్రధానికి వినతి పత్రం అందచేశారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేందుకు బైసన్‌పోల్‌, జింఖానా మైదానాల్లో ఏదొకటి కేటాయించాలని వారు ప్రధానిని కోరారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రక్షణ భూముల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతుంది. మల్కాజ్‌గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం నిర్మిస్తామని.. దాని ద్వారా 44వ నంబర్‌ జాతీయ రహదారి, ఒకటో నంబర్‌ రాష్ట్ర రహదారి అనుసంధానానికి అనువుగా ఉంటుందని ఎంపీలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.