వారాంతాన మోడీ కీలక భేటీ

వారాంతాన మోడీ కీలక భేటీ

రూపాయితో పాటు స్టాక్ మార్కెట్లు క్షీణించడం ముఖ్యంగా  దేశీయ మార్కెట్ కు విదేశీ ఇన్వెస్టర్లు గుడ్ బై చెప్పడం.. వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ప్రధాని మోడీ వారాంతాన కీలక  భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ విడుదలైన వాణిజ్య లోటు అనుకున్న స్థాయిలో ఉంది. అయితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ మాత్రం కాస్త నిరాశాజనకంగా ఉంది. వినియోగదారుల రీటైల్ ద్రవ్యోల్బణం కూడా దిగి వచ్చింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. త్వరలోనే నాలుగు కీలక రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతున్నందున పెట్రో ఉత్పత్తుల ధరలు కీలకం అంశంగా మారింది. వీటన్నింటిపైనా ప్రధాని మోడీ చర్చించే అవకాశముంది.