టీడీపీకి పోలవరం తీర్థయాత్రలా మారింది

టీడీపీకి పోలవరం తీర్థయాత్రలా మారింది

టీడీపీ నేతలకు పోలవరం ప్రాజెక్టు ఓ తీర్థయాత్రలా మారిందని, కార్యకర్తలను తీర్ధయాత్రలకు తీసుకెళ్లినట్లుగా తీసుకెళ్తూ.. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా పోలవరాన్ని సందర్శించి, గ్యాలరీలో మనవడితో తిరుగుతూ ఓట్లకోసం జిమ్నిక్కులు చేస్తున్నారన్నారు. పోలవరం పూర్తయితే తప్ప ఓట్లడగను అన్న పెద్దమనిషి ఇప్పుడే ఎందుకు తిరుగుతున్నారని సవాల్ చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో రకంగా పోలవరంపై ప్రారంభోత్సవాలు చేస్తూ వస్తున్నారని, కాంట్రాక్టర్లకు ప్రజాధనం కట్డబెటుతూ ప్రాజెక్టును కల్పవృక్షం లాగా కామధేనువుగా మార్చుకుంటున్నారు..


ఇక ఏపీలో కూడా టీడీపీ నేతలు కాంగ్రెస్ తో జతకట్టే పరిస్ధితులు కనిపిస్తున్నాయని, అయితే పొత్తుల్లో తప్పులేకకపోయినా నైతికత ముఖ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, టీఆర్ఎస్ లతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారని, విజ్ఞులైన తెలుగు ప్రజలు దీన్ని అర్ధం చేసుకోవాలన్నారు రాంబాబు.