జయరాం కేసు: పోలీసుల న్యాయ నిపుణుల సలహా..

జయరాం కేసు: పోలీసుల న్యాయ నిపుణుల సలహా..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు బంజారాహిల్స్ ఏసీపీ. ఏపీ నుంచి తెలంగాణకు ఈ కేసు బదిలీ కాగా... ఇప్పటికే కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించేందుకు నందిగామ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రాకేష్‌రెడ్డి, శిఖా చౌదరి, శ్రీనివాస్, జయరాం భార్య పద్మశ్రీని ప్రశ్నించనున్నారు పోలీసులు. ఏపీ పోలీసులు దర్యాప్తుపై సంతృప్తిచెందని జయరాం భార్య పద్మశ్రీ... తెలంగాణ పోలీసులు విచారణ జరపాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ సర్కార్ ఈ కేసును హైదరాబాద్‌ పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.