చైనీస్ మంజాలపై పోలీసులు ఉక్కుపాదం

చైనీస్ మంజాలపై పోలీసులు ఉక్కుపాదం

హైదరాబాద్ పాతబస్తీలో కార్డెన్ సెర్చ్ జరిగింది. సౌత్ జోన్ డీసీపీ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల్ బాగ్ ప్రాంతంలో 160 మంది పోలీసు లు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.చైనీస్ మంజా అమ్మకాలను అదుపు చేసేందుకు ఈ సెర్చ్ నిర్వహించారు. 35 చేరకుల చైనీస్ మంజాలను సీజ్ చేసి,  మంజా విక్రయదారుల మీద చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజలు కూడా చైనీస్ మంజా వాడకుండా పతంగులు ఎగురవేయలని డీసీపీ  అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు.