బుల్లినటి ఝాన్సీ కేసు దర్యాప్తు వేగవంతం

బుల్లినటి ఝాన్సీ కేసు దర్యాప్తు వేగవంతం

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసారు. సూసైడ్ నోట్ ఉంటుందన్న అనుమానంతో శ్రీనగర్ కాలనీలోని ఝాన్సీ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆమె ప్రియుడు సూర్య వేధింపులపై ఆధారాలు సేకరించామని తెలిపిన పోలీసులు ఇంకా ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. నటి కాబట్టి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ విజయకుమార్ చెప్పారు. మరోవైపు తన సోదరి మృతికి సూర్య వేధింపులే కారణమని ఝాన్సీ సోదరుడు దుర్గాప్రసాద్ ఆరోపించారు. డైరీలోని అన్ని పేజీలు సూర్య కోసమే రాసిందని, డైరీని పోలీసులకు అందజేసామని ఝాన్సీ సోదరుడు చెప్పుకొచ్చారు.