మారిన కన్నడ రాజకీయ సమీకరణలు...

మారిన కన్నడ రాజకీయ సమీకరణలు...

కర్నాటకలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి... సాధారణ మెజార్టీ దాటిందనుకున్న భారతీయ జనతా పార్టీ మళ్లీ కాస్త వెనకబడింది. మ్యాజిక్ ఫిగర్‌కు ఏడు సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. దీంతో ఎవరో ఒకరి మద్దతు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జేడీ (ఎస్) మద్దతు తీసుకుంటుందా? లేక ఆ పార్టీని చీలుస్తుందా? అనేది చూడాలి. ఫలితాలు వెలువడుతున్నప్పుడు పూర్తి దీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీ... ఇప్పుడు ఏం చేయాలన్నదానిపై వ్యూహరచనలో మునిగిపోయింది. అయితే ఇటు కాంగ్రెస్-జేడీ(ఎస్‌) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలూ లేకపోలేదు. ఆ రెండు పార్టీలు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజార్టీ అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జేడీఎస్‌తో టచ్‌లో ఉన్నారు. మరి పరణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.