పాపం పూజకు ఆ విషయమే తెలియదట..!!

పాపం పూజకు ఆ విషయమే తెలియదట..!!

 

టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు.  అక్కడినుంచి బాలీవుడ్ వెళ్లి అక్కడా ప్రయత్నాలు చేసింది.  అక్కడా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చింది.  ఇప్పుడు భారీ ఆఫర్లు ఆమె ముందు ఉన్నాయి. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి నటులతో నటిస్తున్నది.  ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటె ఏమౌతారు అంటే.. మాములుగా నటీనటులు చెప్పేదంతా ఒక్కటే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననో, ఇంజినీరింగ్ కాబోయి హీరో అయ్యాననో చెప్తారు.  పూజాకు మాత్రం ఆ క్లారిటీ లేదట.  డాక్టర్.. ఇంజనీర్ దీనిపై క్లారిటీ లేదని, చిన్నప్పటి నుంచి తనను అబ్బాయిలా పెంచారని, జుట్టు కట్టించుకొని జీన్స్ వేసుకొని తిరిగేదానినని చెప్తున్నది.  సినిమాల్లోకి వస్తానని అసలు ఊహించలేదని అంటోంది పూజా.