అదే లైన్ తో పూరి కూడా..!?

అదే లైన్ తో పూరి కూడా..!?
ఒక సామాన్యుడు అనుకోకుండా ముఖ్యమంత్రిగా మారితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ప్రతిరూపం శంకర్ ఒకే ఒక్కడు.  ఈ సినిమా అప్పట్లో సంచనలం సృష్టించింది.  ఈ సినిమా స్ఫూర్తితోనే తెలుగులో లీడర్, భరత్ అనే నేను సినిమాలు వచ్చాయి.  రెండు తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి.  ఇప్పుడు పూరి కూడా ఇదే బాటలో ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో కథను సిద్ధం చేస్తున్నాడు.  ఈ కథ ఎప్పుడో సిద్ధమైంది.  స్క్రిప్ట్ కూడా పూర్తయింది.  ఈ కథను మహేష్ కు చెప్పడం, మహేష్ కూడా కథను ఓకే చేయడం అయిపోయాయి.  కానీ, ఎందుకో ఆ ప్రాజెక్ట్ పక్కకి వెళ్ళిపోయింది. కారణాలు ఏవైనా కావొచ్చు.  
మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించాడు. సినిమా హిట్ అయింది.  దాదాపు పూరి అనుకున్న కథ కూడా ఇలానే ఉంటుందట.  కాపీ అవుతుందని భావించిన పూరి పాత స్క్రిప్ట్ లో మార్పులు చేసి మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు.  ఇండియా అంటే ఎలా ఉండాలి..? ఎలాంటి చట్టాలు ఉంటె బాగుంటుంది..? ఎలాంటి మార్పులు ఉండాలి అనే విషయం చుట్టూనే కథ తిరుగుతుదట.  దీనికి జనగణమన అనే టైటిల్ ను పూరి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.  ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ .. దర్శకుడు పూరితో సినిమా చేయలేడు.  మరి ఈ జనగణమనకు పూరి ఎవరిని ఎంపిక చేసుకుంటాడో చూడాలి.