హిట్ టాక్ తెచ్చుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' !

హిట్ టాక్ తెచ్చుకున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' !

నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రం ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల బెనిఫిట్ షోల రూపంలో సినిమాను ప్రదర్శించారు.  మొదటి షో నుండే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.  ఎన్టీఆర్ పాత్రలో  బాలయ్య అద్భుతంగా నటించాడని, ఎన్టీఆర్ జీవితాన్ని మరోసారి గుర్తుచేశారని అభిమానులు అంటున్నారు.  దర్శకుడు క్రిష్ సైతం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి న్యాయం చేశారని అంటున్నారు.  ఓపెనింగ్ వసూళ్లు కూడ బ్రహ్మాండంగా ఉన్నాయి.  మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య తన సినిమాతో శుభారంభాన్ని ఇచ్చారన్నమాట.