20 నుండి మొదలుకానున్న ప్రభాస్ కొత్త సినిమా !

20 నుండి మొదలుకానున్న ప్రభాస్ కొత్త సినిమా !

రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమా ఈరోజు ఉదయం అధికారికంగా లాంచ్ అయింది.  ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ ఈ నెల 20వ తేదీ నుండి యూరప్ లో మొదలుకానుంది.  పూజ హెగ్డే కథానాయకిగా నటించనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. 

'జిల్' ఫేమ్ కెకె రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.  ఇకపోతే ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.  ఈ సినిమాతో పాటే ప్రభాస్ 'సాహో' చిత్రీకరణలో కూడ పాల్గొననున్నారు.