ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా

ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా

హైదరాబాద్ గాంధీభవన్ లో మంగళవారం జరగాల్సిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండడంతో ఈ సమావేశం ఈనెల 17కు వాయిదా వేశారు. ఈ నెల 15, 16, 17 మూడు రోజుల పాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. 16న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, 17 సాయంత్రం 5 గంటలకు పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.