పరువు హత్యగానే భావిస్తున్నాం: ఎస్పీ

పరువు హత్యగానే భావిస్తున్నాం: ఎస్పీ

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన హత్యపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రణయ్ హత్యను పరువు హత్యగానే చూస్తున్నామని జిల్లా ఎస్పీ రంగానాథ్ తెలిపారు. గతంలోనే ప్రాణహాని ఉందని అబ్బాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అన్నారు. యువతి తండ్రి మారుతిరావును హెచ్చరించామని, ప్రణయ్ కు ఎలాంటి ప్రాణహాని ఉండదని తెలిపాడన్నారు. మొన్నటి వరకు కూతురు, అల్లుడితో సఖ్యతగా ఉంటే వివాదం సద్దుమణిగిందనున్నామని ఎస్పీ అన్నారు. అమ్మాయి తండ్రే హత్యకు సూత్రదారి అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

ప్రణయ్ ఆరునెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్యను ఆసుపత్రి వద్ద వదిలిపెట్టి వస్తుండగా దుండగులు అతికిరాతకంగా కత్తితో నరికి చంపారు. ఆసుపత్రి గేటు వద్ద మాటు వేసిన దుండగుడు ప్రణయ్‌ మెడపై రెండు సార్లు విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు విలవిల్లాడుతూ ప్రాణాలు కొల్పోయాడు.