కోహ్లీ సేనకు ప్రధాని శుభాకాంక్షలు

కోహ్లీ సేనకు ప్రధాని శుభాకాంక్షలు

అస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్ట్ సిరీస్ గెలిచింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ డ్రా అయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గానే కాదు.. తొలి ఆసియా కెప్టెన్‌గానూ నిలిచాడు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కోహ్లి సేనకు ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'ఆస్ట్రేలియాలో ఓ చారిత్రక క్రికెట్ విజయమిది. టీమిండియాకు శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన విజయానికి వారు అన్ని విధాలుగా అర్హులు. సిరీస్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు, టీమ్ వర్క్ కనిపించింది' అని మోడీ ట్వీట్ చేశారు.