స్కూల్ టీచర్ అదృశ్యం...

స్కూల్ టీచర్ అదృశ్యం...

రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న యువతి అదృశ్యమైంది... శంషాబాద్ సిద్ధంతికి చెందిన సౌమ్య... ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తుండగా... రెండు రోజుల క్రితం షాపింగ్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పివెళ్లింది. రెండు రోజులైనా తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.