కమెడియన్ కు డైరెక్షన్ కల!

కమెడియన్ కు డైరెక్షన్ కల!

సినిమా ఇండస్ట్రీకు డైరెక్టర్ అవుదామని వచ్చి నటులుగా మారిన వారెందరో.. తను కూడా అదే కోవకు చెందిన వాడనని అంటున్నాడు నటుడు ప్రియదర్శి. 'టెర్రర్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శికి 'పెళ్లిచూపులు'తో మంచి బ్రేక్ ఇచ్చింది. వరుస అవకాశాలు రావడంతో నటుడిగా బిజీ అయిపోయాడు. అయితే ఎప్పటికీ నటుడిగానే ఉండిపోనని కచ్చితంగా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు ప్రియదర్శి. సినిమాల్లోకి రాకముందు కొన్ని లఘుచిత్రాలను డైరెక్టర్ చేయడంతో పాటు తనే సొంతంగా నిర్మించి వాటిలో నటించాడు. 

తన దగ్గర చాలా కథలు ఉన్నాయట. స్క్రిప్ట్ లు రెడీ చేసుకొని నిర్మాతల చూట్టూ ఎంతో తిరిగానని కానీ అవకాశం మాత్రం రాలేదని అన్నాడు. ఆ సమయంలోనే సినిమా కష్టాలు తెలిసొచ్చాయని తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో తిండికి మాత్రం ఎలాంటి లోటు రాలేదని చెప్పాడు. డైరెక్టర్ విభాగం నుండి వచ్చిన తనకు డైరెక్టర్ గా అవకాశం రావడానికి సమయం పడుతుందేమో గానీ సినిమా చేయడం మాత్రం ఖాయమని అంటున్నారు. మరి ప్రియదర్శి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి!