ట్విటర్ లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ

ట్విటర్ లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ

ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా , తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన ప్రియాంకాగాంధీ సోషల్‌ మీడియాలో అడుగు పెట్టారు. సోమవారం ఉత్తరప్రదేశ్ లో తొలిసారిగా అడుపెడుతున్న సందర్భంగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లోతన అధికారిక ట్విటర్‌ ఖాతాను తెరిచారు. అంతే నిమిషాల్లో 22వేల  మందికి పైగా ఫాలోవర్లు ఆమె ఖాతాలో చేరిపోయారు. ఈరోజు అన్న రాహుల్, పశ్చిమ యూపీ ప్రచార ఇన్ ఛార్జ్ జ్యోతిరాధ్య సింధియాతో కలిసి నాలుగురోజుల పాటు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగే రోడ్ షోలో ఆమె కూడా పాల్గొననున్నారు. తన పర్యటనలో తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌ తో కలిసి ప్రియాంక గాంధీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి  పెద్దదిక్కుగా భావిస్తున్న  ప్రియాంక గాంధీ ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఆమె రాజకీయ రంగప్రవేశంపై రాజకీయ వర్గాల్లో  ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు  రెండు వారాల  క్రితం తెరపడిన సంగతి తెలిసిందే.  క్రియాశీల రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా పర‍్యటిస్తున్నారు.