యూపీలో ప్రియాంక రోడ్ షో 

యూపీలో ప్రియాంక రోడ్ షో 

ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, యూపీ తూర్పు కాంగ్రెస్ రథసారధి ప్రియాంక గాంధీ లక్నో  రోడ్ షో ప్రారంభించారు. మిషన్ యూపీ పేరుతో ప్రారంభించిన ఈ రోడ్ లో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీ పశ్చిమ ప్రాంత జనరల్ సెక్రటరీ జ్యోతిరాధిత్య సిందియాతో పాటు  కూడా పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర ప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా ఈ రోడ్‌ షో చేపట్టారు.  ప్రియాంక.. సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తోడుగా ఈ రోడ్‌ షో ప్రారంభించారు. బస్సుపైన నిలబడి ప్రజలకు అభివాదం  నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వరకు 25 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన సాగింది.రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు ప్రియాంకకు అప్పగించారు.  ప్రస్తుతం ఆమె పరిధిలో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి కంచుకోటలుగా చెప్పుకొనే స్థానాలున్నాయి. భారీగా కార్యకర్తలు, శ్రేణులు తరలివచ్చారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక రోడ్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్ షో సందర్భంగా కార్యకర్తలు ప్రియాంక ఫోటోలతో లక్నో నగరాన్ని ముంచెత్తారు. దుర్గామాత రూపంలో ప్రియాంకను చూపుతున్న పోస్టర్‌ పలువురిని ఆకర్షించిది.  నాలుగు రోజుల పాటు యూపీలో ప్రియాంక పర్యటించనున్నారు. 30 కిలోమీటర్ల మేర మెగా రోడ్‌షో నిర్వహించనున్నారు ప్రియాంక. రోడ్‌షోలో భాగంగా పలు చోట్ల ఆమె ఉపన్యాసం ఇవ్వనున్నారు.