రోబో 2పాయింట్ ఓ.. ఫ్రీ టికెట్స్ కావాలా..!!

రోబో 2పాయింట్ ఓ.. ఫ్రీ టికెట్స్ కావాలా..!!

శంకర్ దర్శకత్వం వహిస్తున్న రోబో 2 పాయింట్ ఓ సినిమా టీజర్ ఈనెల 13 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.  ఈ టీజర్ కోసం తమిళనాడులో పెద్ద ఎత్తున థియేటర్స్ ను ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.  3డి లో రిలీజ్ చేయబోతున్న ఈ 2ఓ టీజర్ చూసేందుకు టికెట్స్ ను ఫ్రీగా అందిస్తున్నది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఫ్రీ టికెట్స్ కావాలనుకునేవారు +91 9099949466 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్లకు థియేటర్స్ లో టీజర్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మధురై, తిరుచ్చి, దిండిగల్, తంజావూర్, పుదుకోట్టై తదితర చోట్ల ఉన్న థియేటర్స్ లో రోబో 2 పాయింట్ ఓ టీజర్ ను ప్రదర్శించబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొన్నది.