ప్రొఫెసర్ హరగోపాల్ ను ఈడ్చుకెళ్లిన పోలీసులు

ప్రొఫెసర్ హరగోపాల్ ను ఈడ్చుకెళ్లిన పోలీసులు

హైదరాబాద్ గన్ పార్క్ వద్ద జరిగిన ర్యాలీలో ప్రొఫెసర్ హరగోపాల్ పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయనను బలవంతం ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన గోషామహల్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సేవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు గన్ పార్క్ వద్ద నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కాపాడుకుందాం అనే నినాదంతో తెలంగాణ విద్యా పోరాట, పరిరక్షణ కమిటి వందరోజుల విద్యా పోరాట యాత్రను ప్రారంభించింది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.