కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్

కమీషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్

కమీషన్ల కోసమే తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ అని ఆరోపించారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి... నల్గొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... నల్గొండలోని మర్రిగూడ బైపాస్ నుంచి ఓల్డ్ సిటీ 34 వార్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు కోమటిరెడ్డి సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం నార్కెట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకేసారి రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఇస్తామని, రాష్ట్రంలోని 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు.