ఏపీ వ్యాప్తంగా 'మోడీ.. గో బ్యాక్‌'

ఏపీ వ్యాప్తంగా 'మోడీ.. గో బ్యాక్‌'

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. 'మోదీ గో బ్యాక్‌' అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహిస్తుననారు. గుంటూరు జిల్లా టవర్ సెంటర్‌లో మోడీకి వ్యతిరేకంగా టీడీపీ నిరసన ధర్నా నిర్వహించింది. నల్ల జెండాలతో రోడ్డుపై ర్యాలీ చేసి.. టైర్లు తగలబెట్టారు టీడీపీ నేతలు. జిన్నా టవర్‌ సెంటర్‌లో మోడీ ఫ్లెక్సీని చించుతండగా.. పోలీసులు అడ్డుకున్నారు.