ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసుల పురోగతి

 ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసుల పురోగతి

సంచలనం రేపిన బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య వాట్సాప్ సంభాషణ ఆధారంగా పోలీసులు సూర్యను విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్‌ కోరారు. ఝాన్సీ ఇంట్లో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆమె డైరీని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. డైరీలో నాని మీద ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ ఝాన్సీ రాసుకున్నట్లు తెలుస్తుంది. అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.