'ఆపరేషన్‌ గరుడ' అంటే ఏంటో మాకే తెలియదు..

'ఆపరేషన్‌ గరుడ' అంటే ఏంటో మాకే తెలియదు..

బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి ధర్మాబాద్‌ కోర్టు ఇచ్చిన నోటీసులతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఏం జరిగినా టీడీపీ నేతలు కేంద్రానికి ఆపాదిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2010లో కేసు అయిందని.. దానికి బీజేపీపై నింద వేయడం సరికాదని అన్నారు. కేంద్రం కక్షపూరితంగా కేంద్రం వ్యవరిస్తుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఇటువంటి వారెంట్లతో బీజేపీ, మోడీ బలపడేదేం ఉంటుందని పురంధరేశ్వరి ప్రశ్నించారు. 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్లే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింన్నారు. ఆపరేషన్‌ గరుడ అంటే ఏంటో బీజేపీకి తెలియదని ఆమె స్పష్టం చేశారు.