పూరి కుమారుడు 'రొమాంటిక్' !

పూరి కుమారుడు 'రొమాంటిక్' !

పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి గతేడాది హీరోగా 'మెహబూబా' అనే సినిమా చేశాడు.  ఆ చిత్రానికి పూరియే దర్శకుడు, నిర్మాత.  కానీ సినిమా పెద్దగా ఆడలేదు.  దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆకాష్ రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు.  ఈ సినిమాను పూరి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్ పాడూరి డైరెక్ట్ చేయనున్నాడు.  ఈ చిత్రానికి 'రొమాంటిక్' అనే టైటిల్ ఫిక్స్ చేశాడు పూరి.  ఈ సినిమాకు పూరి కథను అందించడమే కాక స్వయంగా నిర్మిస్తున్నాడు.  ఈ ప్రాజెక్ట్ ఈరోజే అధికారికంగా లాంచ్ అయింది.  సినిమాలో హీరోయిన్, రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.