టీసీఎస్‌ పనితీరు భేష్‌

టీసీఎస్‌ పనితీరు భేష్‌

ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబర్చింది. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 7,901 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ.7929 కోట్ల నికర లాభం ఆర్జించగలదని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రూ. 36,854 కోట్లకు చేరింది.కంపెనీ తన వాటాదారులకు రెండోసారి రూ. 4 ఇంటెరిమ్‌ డివిడెండ్‌ను ప్రకటించింది. ఇంటరిమ్‌ డివిడెండ్‌కు రికార్డు తేదీ అక్టోబర్ 24. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ ఆపరేటింగ్‌ మార్జిన్‌ 1.44 శాతం పెరిగి 26.5 శాతానికి చేరింది.