క్యూనెట్ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం

క్యూనెట్ మోసాలపై పోలీసులు ఉక్కుపాదం

క్యూనెట్ మోసం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్యూ నెట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 51 మంది వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా వేలకోట్లకు క్యూనెట్ మాయగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఎకానిమిక్స్ అఫెన్స్ వింగ్ అధికారులు ముఠా గుట్టును రట్టు చేశారు.ఇప్పటికే క్యూనెట్ చైర్మన్ మైకెల్ ఫెరారి అరెస్ట్ అయ్యాడు.  సైబరాబాద్ పరిధిలో క్యూనెట్ మోసం పై 14 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా క్యూ నెట్ బ్యాంకు అకౌంట్లను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై లోని క్యూనెట్ గోదాంలను సైతం సీజ్ చేసి, 51 మంది కేటుగాళ్లను రిమాండ్ కు తరలించారు. కాసేపట్లో నిందితులను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.