క్యూనెట్ మోసంపై దర్యాప్తు ముమ్మరం

క్యూనెట్ మోసంపై దర్యాప్తు ముమ్మరం

క్యూనెట్ మల్టిలేవల్ మార్కెటింగ్ మోసంపై సైబరాబాద్ కమిషనరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. క్యూనెట్ మోసాలపై సైబరాబాద్ కమిషనరేట్ కి భాదితులు క్యూ కడుతున్నారు. ఈ స్కాం పై గత 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బాధితులు గుర్మీత్, అనూజలు ముంబై నుండి వచ్చి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ ను కలిశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశారు.

నిరుద్యోగులు, విద్యార్థులు, అమాయకులను టార్గెట్ గా చేసుకొని క్యూనెట్ మల్టిలేవల్ యాజమాన్యం కోట్ల రూపాయలను వసూలు చేసింది. పొలీసులు ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేసి 2 కోట్ల ఏడు లక్షలు నగదును సీజ్ చేశారు. 40 అకౌంట్ లను కూడా బ్లాక్ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భాదితులు ఉన్నారు. హైదరాబాద్ లో లక్షమంది బాధితులు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.