రిజర్వేషన్లు పెంచితే ఊరుకోం..

రిజర్వేషన్లు పెంచితే ఊరుకోం..

రిజర్వేషన్లను 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతామంటూ ఊరుకోబోమని హెచ్చరించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య... అ్రగకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన... అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్ర మోడీకి దమ్ముంటే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు 53 శాతం రిజర్వేషన్లు కల్పించాలని  డిమాండ్ చేశారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే దొంగనాటకలు చేస్తున్నారని కేంద్రంపై మండిపడ్డా కృష్ణయ్య... ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు ఇస్తామంటే కుదరదని... పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.