పొత్తులపై రఘువీరా ఏమన్నారంటే..

పొత్తులపై రఘువీరా ఏమన్నారంటే..

ఎన్నికల్లో పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదని ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈనెల 20వతేదీలోగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అన్నారు. పొత్తుల పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం మంచిది కాదన్న ఆయన.. అందుకే త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక. ఇంటింటి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టనున్నామని రఘువీరా వివరించారు.