రాహుల్‌ సభకు అనుమతివ్వం...

రాహుల్‌ సభకు అనుమతివ్వం...

ఉస్మానియా యూనివర్సటీలో ఏఐసీసీ అధ్యక్షుకు రాహుల్‌ గాంధీ సభలకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 13, 14 తేదీల్లో తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ ఓయూలో జరిగే సభల్లో పాల్గొనేలా పార్టీ షెడ్యూల్‌ రెడీ చేసింది. ఇందులో భాగంగా ఓయూలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఐతే.. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతినివ్వలేమని ఓయూ అధికారులు స్పష్టం చేశారు. ఈక్రమంలో హైకోర్టును ఆశ్రయించాలని విద్యార్థి సంఘాల నాయకులు భావిస్తున్నారు.