దట్ ఈజ్ 'రాహుల్'

దట్ ఈజ్ 'రాహుల్'

నేడు భారత మాజీ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌ పుట్టిన రోజు. నేటితో ద్రవిడ్‌ 46వ పడిలోకి అడుగుపెట్టారు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు 'ద వాల్', 'మిస్టర్ డిపెండ‌బుల్' అని పిలుచుకుంటారు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు ద్రవిడ్ వీడ్కోలు పలికారు. ద్రవిడ్ టెస్టుల్లో 13,288 రన్స్ చేశారు. అందులో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 10,889 పరుగులు చేయగా.. 12 సెంచరీలు, 86 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఒకే ఒక టీ20లో 31 పరుగులు చేశారు. మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశారు. ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. రిటైరైన తర్వాత బీసీసీఐ టీమిండియా కోచ్ పదవి ఇస్తా అన్న కూడా స్వీకరించలేదు. ప్రస్తుతం ఇండియా 'ఏ'కు కోచ్‌గా సేవలందిస్తున్నారు.

పుట్టిన రోజు సందర్భంగా క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐ ప్రత్యేకంగా ఓ వీడియోను పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. పాక్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ద్రవిడ్‌ సెంచరీ సాధించారు. ద్రవిడ్‌ తన మార్క్ షాట్లతో సెంచరీ పూర్తి చేశారు.