దుబాయ్ వ్యాపారవేత్తలతో రాహుల్ భేటీ

దుబాయ్ వ్యాపారవేత్తలతో రాహుల్ భేటీ

రెండు రోజుల యుఏఈ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బిజీబిజీగా గడుపుతున్నారు. ముందుగా ఆయన దుబాయ్ లో స్థానిక వ్యాపారవేత్తలతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం జరిపారు. ఆ తర్వాత ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఇన్ దుబాయ్ సభ్యులతో రాహుల్ ముఖాముఖి సంభాషణ నిర్వహించారు. దుబాయ్ లోని పంజాబీలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.