ప్రధాని మనసులో మాట చెప్పటం లేదు 

ప్రధాని మనసులో మాట చెప్పటం లేదు 

ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో తన మనసులో మాట చెప్పటం లేదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు.  ఇవాళ దుబాయి పర్యటనకు వెళ్లిన ఆయనకు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఇక్కడ ఉండే భారతీయ కార్మికులు తమ సమస్యలను చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తే... ప్రధాని ఇక్కడికి వచ్చి ఏదో మాటలు చెప్పి వెళ్లారని విమర్శించారు. భారతీయ కార్మికులు దుబాయిలో పడుతున్న శ్రమకు హాట్స్ ఆఫ్ అన్నారు. వారిని చూసి గర్వపడుతున్నానని తెలిపారు. కార్మికులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు తమకు తెలుసనీ... అధికారంలోకి రాగానే వారికి సాయం చేస్తామని వెల్లడించారు. తాను ఇక్కడికి రావటం ముఖ్య ఉద్దేశం మీ కష్టాలు వినటానికే గాని... తాను మాటలు చెప్పటానికి కాదు అని రాహుల్ వెల్లడించారు. రాహుల్ రెండ్రోజుల దుబయి పర్యటనలో ఆ దేశ మంత్రులతో కూడా భేటీ కానున్నారు. రాహుల్‌గాంధీ ఇవాళ, రేపు దుబాయిలో పర్యటిస్తారు. దుబాయి క్రికెట్‌ స్టేడియంలో గల్ఫ్‌ ఎన్నారైలతో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు.