రాహుల్ టూర్ సాగనుంది ఇలా...

రాహుల్ టూర్ సాగనుంది ఇలా...

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి... ఇప్పటికే టి.పీసీసీ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసి... రాహుల్ టూర్‌ను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగాలి. అన్నదానిపై కసరత్తు చేసి షెడ్యూల్ ప్రకటించింది. రాహుల్ గాంధీ ఈ నెల 13, 14వ తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పర్యటన కొనసాగనుంది. 

రాహుల్ టూర్ షెడ్యూల్: 
-ఈ నెల 13న మధ్యాహ్నం 2.30 కి శంషాబాద్‌ చేరుకోనున్న రాహుల్.
- క్లాసిక్ ఫంక్షన్ హాల్‌లో మహిళా సంఘాల సభ్యులతో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు దేశ, రాష్ట్ర మహిళ సమస్యలపై చర్చ 
-ప్రత్యేక బస్సులో శేరిలింగంపల్లిలో నిర్వహించనున్న సభకు హాజరు, ఆంధ్ర, రాలయసీమ ప్రాంత నేతలు, ప్రజలతో భేటీ
- రాత్రి 8 గంటలకు హరిత ప్లాజాలో రాహుల్ గాంధీ బస
- ఈ నెల 14 న ఉదయం బూత్ అధ్యక్షుడి నుండి  పీసీసీ స్థాయి వరకు ఒకేసారి టెలీ కాన్ఫరెన్స్ 
- ఉదయం 10.30 నుండి 11.30 వరకు మీడియా ఎడిటర్లతో మీటింగ్
- మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు దాదాపు 150 మంది పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో తాజ్ కృష్ణలో సమావేశం
- మధ్యాహ్నం 2.30కి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించనున్న రాహుల్
- మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గోశామహల్ నియోజకవర్గ స్థాయి మీటింగ్‌లో  పాల్గొంటారు. 
- సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌లో జరిగే విద్యార్థి, నిరుద్యోగ గర్జనకు హాజరు
- రాత్రి 7.30 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం.