ఇవాళ కోర్టు విచారణకు రాహుల్‌

ఇవాళ కోర్టు విచారణకు రాహుల్‌

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొద్దిసేపటి క్రితం మహారాష్ట్రలోని భివండికి బయలుదేరారు. ఆరెస్సెస్‌ వేసిన పరువు నష్టం కేసులో భాగంగా ఇక్కడి కోర్టులో విచారణకు ఆయన హాజరవుతారు. మహారాష్ట్రలోని సోనాలేలో 2014లో జరిగిన బహిరంగ సభలో ఆరెస్సెస్‌పై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఆర్‌ఎస్‌ఎస్సే మహాత్మాగాంధీని చంపింఇ. ఇప్పుడేమో బీజేపీ వాళ్లు గాంధీ గురించి మాట్లాడతున్నారు' అని రాహుల్‌ అన్నట్టు అప్పుడు వార్తలొచ్చాయి. దీంతో థానేలోని భివండి మేజిస్ట్రేట్‌ కోర్టులో ఆరెస్సెస్‌ కార్యకర్త రాజేష్‌కుంతే.. రాహుల్‌పై నేరపూరిత పరువ్ఞనష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా ఇవాళ రాహుల్‌ గాంధీ హాజరవుతున్నారు.